14-10-2025 12:27:59 AM
ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 13 (విజయక్రాంతి): పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో6 వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు.
విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని,ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. అంతే కాకుండా జిల్లా స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని ఎస్పి సూచించారు. వ్యాసరచన అంశం డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు.
పోటీలో పాల్గొనే విధానం
1. కింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసి పాల్గొనండి. 2. మీ పేరు, విద్యార్హత, ఇతర వివరాలు నమోదు చేయండి. 3. వ్యాసాన్ని పేప్ప రాసి, దానిని చిత్రం లేదు ఫార్మాట్లో 500 పదాలు మించకూడదు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.