23-10-2025 08:29:18 PM
ముళ్ల పొదలను తొలగించిన పోలీసులు
భీమిని (విజయక్రాంతి): భీమిని మండలంలోని జగ్గయ్యపేట, పెద్దపేట గ్రామాలకి మధ్య ఉన్న రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను భీమిని పోలీసులు తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా ఈ పిచ్చి మొక్కలతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని గమనించిన భీమిని ఎస్సై విజయ్ కుమార్ గురువారం జగ్గయ్యపేట, పెద్దపేట గ్రామాల మధ్య దాదాపు రెండు కిలో మీటర్ల మేర రహదారిపై ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను ట్రాక్టర్ సహాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది లక్ష్మణ చారి, మహేశ్వరి, వినోద్ కుమార్, గ్రామస్థులు అక్బర్ పాషా పాల్గొన్నారు.