11-08-2025 01:19:31 AM
టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేస్తూ, ఇవాళ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా తెరకెక్కించి విడుదల చేయనున్నారు. వేర్వేరు జానర్స్లో ఎప్పటిలాగే క్వాలిటీ స్టోరీటెల్లింగ్కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరించేలా ప్లాన్ చేస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి స్థాపించిన ఈ సంస్థ ఇప్పటివరకు క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రసంశలు పొందిన ఎన్నో హిట్ సినిమాలు అందించింది.
రాబోయే ప్రాజెక్టుల గురించి నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రతి సినిమా థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఉంటుంది. మేము ఎప్పుడూ క్వాలిటీ కంటెంట్కే ప్రాధాన్యం ఇస్తాం. ఈ ఆరు సినిమాలు కూడా అదే ట్రడిషన్ను కొనసాగిస్తాయి. అద్భుతమైన నిర్మాణ విలువలతో ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చిత్రీకరించనున్నాం. డైరెక్టర్లు, హీరోల వివరాలు త్వరలో ప్రకటిస్తాం‘ అన్నారు.