27-09-2025 12:52:58 AM
ఆశించిన రీతిలో ఉందని వైద్యం మాతా శిశు ఆసుపత్రి తీరు
కొత్తగూడెం, సెప్టెంబర్ 26, (విజయక్రాంతి) ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ వైద్యా న్ని కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్నామని, సకల సౌకర్యాలతో మెరుగుపరుస్తున్నామని గొప్పలు చెప్పుతున్నా.. క్షేత్రస్థాయిలో అందు కు విరుద్ధంగా ప్రభుత్వ వైద్యశాలలు కొనసాగుతున్నాయనీ అనడానికి జిల్లా కేంద్రంలో గల మాత శిశు సంరక్షణ కేంద్రమే చక్కటి ఉదాహరణ. చాలినంత సిబ్బంది లేకపోవ డం .... ఉన్న సిబ్బంది సమయపాలన పా టించకపోవడం, ఆసుపత్రిలో అసౌకర్యాలు తిష్ట వేయడం తో వైద్యం కోసం ఎంతో ఆశతో జిల్లా నలమూలల నుంచి ఆసుపత్రి లో చేరి ఎందుకు చేరాం రా బాబు అనేరీతీలో ఆసుపత్రి ఉంది.
నాలుగు సంవత్సరా ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ఉండవలసిన సిబ్బంది కంటే అతి తక్కువ మంది వెదులు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 మంది వైద్యులు పనిచేయాల్సి ఉండగా ఒక్కరిద్దరితో ఆసుపత్రిని నెట్టుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్న అధికారులు సైతం సమయపాలన పాటించకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. ఈసీజీ, ఎక్స్ రే వంటి పరికరాలు ఉన్న శిక్షణ అనుభవం లేని ఆపరేటర్లతో రోగుల అవస్థ పడుతున్నా రు.
అప్పుడే జన్మించిన పసి గుడ్డును ప్రవేట్ ఆసుపత్రిలో పరీక్షించి తీసుకురావా లంటూ సిబ్బంది హుకుంజారీ చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైద్యం పట్ల గొప్పలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా దర్శనమిస్తున్నాయి. మహిళా సిబ్బందికి ఎం సి హెచ్ లో రక్షణ లేదని పలువురు వాపోతున్నారు. వైద్యుల నియామకానికి అనేకసా ర్లు నోటిఫికేషన్ జారీ చేసి వెనక్కి తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పరిసరాల అపరిశుభ్రత రోగులను భయాందోళన గురిచేస్తుంది.
ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి సమ ర్థవంతంగా పనిచేయకపోవడం వల్లనే ఈ ఆసుపత్రి దుస్థితి ఈ రీతిలో ఉందని రోగు లు స్పష్టం చేస్తున్నారు. రోగులకు అవసరమైన మందులు కొరత ఆసుపత్రిలో తాం డవిస్తోంది. ప్రిస్క్రిప్షన్ రాసి మెడికల్ షాపు ల్లో మందులు కొనుక్కోవాలని చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సమస్యల వలయంలో కొట్టుమట్టాడుతున్న మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.