27-09-2025 12:54:04 AM
రూ .17 కోట్లతో రహదారుల నిర్మాణం
పనులకు శంకుస్థాపన మండల నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి
గరిడేపల్లి, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): గరిడేపల్లి, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి):నులు పూర్తి చేయాలని నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని భారీ నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియపరచందుకే బయలుదేరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ గానుబండకు చేరుకొని అక్కడ అభిమానులు నాయకుల గ్రామస్తుల మధ్య నిర్మించే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులకు తెలిపేందుకు మంత్రి ప్రయత్నించగా నాయ కులు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో ఆయన లోకల్ మరియు మండల నాయకులు పై అసహనం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న పనులను ప్రజలకు వివరించకుండా ఎలా అని ఆయన ప్రశ్నించారు. తమ పర్యటనకు వచ్చినప్పుడు తనతో పాటు నాయకులు ఉండేందుకు కనిపించేందుకు చూపిస్తున్న శ్రద్ధ గ్రామాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై చూపడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అక్కడే ఏర్పాటు చేసిన శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగమైన దుర్గామాత అమ్మవారి కార్యక్రమంలో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో దుర్గామాత చల్లగా చూడాలని గ్రామస్తులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కల్మలచెరువు గ్రామంలో పలు రోడ్లు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ కూడా గాను బండ లో చేసిన అభివృద్ధి పనులపై వివరద్దామంటే మైకు సరిగ్గా పని చేయలేదని ఇక్కడైనా పని చేస్తుందా లేదా అని ఆయన అనడం గమనార్హం.
మరోసారి ఇలా జరగకుండా మండల పార్టీ బాధ్యులు చూసుకోవాలని ఆయన చురకలు అంటించి మాట్లాడారు. గానుగబండ గ్రామంలో గానుగ బండ నుండి పరెడ్డిగూడెం వరకు 2 కి. మీ దురాన్ని 1.40 కోట్లతో, గానుగ బండ నుండి హనుమంతుల గూడెం వరకు 3.5 కోట్లతో 5 కి. మీ దూరాన్ని నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు అలాగే కల్మలచెరువు గ్రామంలో కల్మలచెరువు నుండి దిర్శించర్ల - చివ్వారిగుడెం వరకు 4.6 కిలోమీటర్ల దూరాన్ని
3.5 కోట్లతో నిర్మించే రోడ్డుకు,కల్మలచెరువు నుండి గానుగబండ వరకు 4 కిలోమీటర్ల దూరాన్ని 2.8 కోట్ల నిర్మించే రోడ్డుకు,కల్మల చెరువు నుండి పాలకీడు సబ్ స్టేషన్ వరకు 6 కిలోమీటర్ల దూరాన్ని 4.2 కోట్లతో నిర్మించే రోడ్డుకు, కల్మల చెరువు నుండి బోత్తలపాలెం వరకు 5కిలోమీటర్ల దూరం 3.5 కోట్లతో నిర్మించే రోడ్డుకు, సోమ్లాతండా వద్ద కల్మల చెరువు నుండి సోమ్లా తండా వరకు 1.2 కి మీ దూరాన్ని 84 లక్షల రూపాయలతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఆర్డీవో శ్రీనివాసులు పంచాయతీ రాజ్ ఏఈ వెంకటయ్య, తహసిల్దార్ కవిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంజన్ రెడ్డి, మాజీ ఎంపీపీ పెండెం శ్రీనివాస్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగనాథ్, మూల గుం డ్ల విజయ సీతారామరెడ్డి, రామంజి గౌడ్, పెండెం ముత్యాలు గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు చామకూరి రజిత, మాజీ ఎంపీటీసీలు చాంద్ మియా, సందీప్, పరమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.