calender_icon.png 17 September, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా-భారత్ మధ్య సానుకూల చర్చలు

17-09-2025 12:56:15 AM

  1. ఢిల్లీ వేదికగా ఇరుదేశాల వాణిజ్య ప్రతినిధుల బృందం భేటీ
  2. ఏడు గంటల పాటు సాగిన చర్చ
  3. ఒప్పందాల పునరుద్ధరణ దిశగా అడుగులు
  4. మరోసారి ద్వైపాక్షిక సమావేశానికి అవకాశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: భారత రాజధాని న్యూఢిల్లీ వేదికగా మంగళవారం భార త్ - అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒ ప్పందంపై చర్చలు జరిగాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండెన్ లించ్ నేతృత్వంలోని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌ఆర్) బృందం, భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌తో సుమారు 7 గంటల పాటు చర్చలు జరిపారు.

చర్చల తర్వాత ఇరు దేశాల ప్రతినిధు లు చర్చలు సానుకూలంగా జరిగాయని, చర్చలు సత్వరం వాణిజ్య ఒప్పందాలు పూర్తి చేసుకునేందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నా రు. 50శాతం సుంకాల బాదుడు తర్వాత అమెరికా మొదటిసారి భారత్‌తో జరిపిన ఈ ద్వైపాక్షిక చర్చలు ఇవే. వాణిజ్య చర్చలను నిలిపివేసిన కొన్ని వారాల తర్వాత, అమెరికా తాజాగా తన వైఖరిని మార్చుకుని మళ్లీ చర్చలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఈసారి అమెరికన్ బృందం ఢిల్లీకే వచ్చింది. గతంలో భారత వ్యవసాయ, పాల ఉత్పత్తుల మార్కెట్లలో పూర్తిస్థాయి ఆధిపత్యం కోరిన అమెరికా, ఈసారి కొన్ని ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించింది. ఈ పరిణామాల రీత్యా ఇరుదేశాలు మరోసారి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.