23-08-2024 12:00:00 AM
‘స్వతంత్ర భారత దేశంలో 78 ఏళ్లు గడిచినా పోస్టల్ శాఖ మాత్రం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇంకా మారడం లేదు. ప్రజలకు పోస్టల్ శాఖ చేరువ కావడం లేదు. చాలా పోస్టల్ సేవలు ఇప్పటికీ ప్రజలకు దూరంగానే ఉంటున్నాయి. చాలా పో స్టాఫీసుల్లో కార్డులు, స్టాంపులు దొరకడం లేదు. ప్రైవేట్ కొరియ ర్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో తపాలా శాఖ మరింత అప్‌గ్రేడ్ కావలసిన అవసరం ఉంది. అంతేకాదు, చాలా పోస్టల్ స్కీమ్‌లు ప్రజలకు తెలియకుండా పోతోంది. ముఖ్యంగా బాలికల కోసం చాలా పథకాలున్నాయి. అలాగే ఆదాయం పన్నునుంచి మినహాయింపు పొందడానికి పలు పథకాలు ఉన్నాయి. కానీ వీటన్నిటి గురించి చాలా మందికి తెలియడం లేదు.
ఇక చాలా పోస్టాఫీసు లు బ్రాంచ్ ఆఫీసులుగానే ఉన్నాయి. చాలా మండల కేంద్రాలు మంచి వ్యాపార కేంద్రాలుగా విరాజిల్లుతున్న చోట సబ్ సోస్ట్టాఫీసులను అప్‌గ్రేడ్ చేయల్సిన ఆవశ్యకతను గుర్తించాలి. సబ్ పో స్టాఫీసులుగా అప్‌గ్రేడ్ కావడం వల్ల చాలా పోస్టల్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పార్సిల్ పంపడం, రిజిస్టర్ పోస్టు చేయడం వంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల పోస్టల్ శాఖకు ఆదాయం కూడా పెరుగుతుంది.
షేక్ అస్లాం షరీఫ్ , శాంతినగర్