calender_icon.png 13 May, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా అధికారికి ప్రజల సత్కారం

13-05-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, మే 12 : ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి సమస్య పరిష్కరించిన హైడ్రా అధికారిని.. అదే ప్రజావాణిలో ప్రజలు సత్కరించారు. మిఠాయి తినిపించి కమిషనర్ ఏవీ రంగనాథ్ చేతుల మీదుగా ఇన్స్పెక్టర్ తిరుమలేష్ను సోమవారం సన్మానించారు.  వేలాది మంది నివాసితులకు మీ అధికారులు దారి చూపారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తో సంతోషం పంచుకున్నారు. వివరాలు..

రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ దగ్గర మధుబన్ కాలనీకి అనుకుని ఉన్న ఇందిరాగాంధీ కో ఆపరేటివ్  హౌసింగ్ సొసైటీలో మొత్తం 800 ప్లాట్లు ఉన్నాయి.  కాటేదాన్ నుంచి శ్రీరాం కాలనీకి వెళ్లే ప్రధాన 60 అడుగుల రహదారిని కలిపే 20 అడుగుల రహదారికి అడ్డంగా నిర్మించిన గోడలను ఈ నెల 6వ తేదీన హైడ్రా తొలగించింది. దీంతో ఇందిరాగాంధీ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీతో పాటు శ్రీరాంనగర్ కాలనీ వాళ్లకు కూడా దగ్గర దారి దొరికిందని అక్కడి నివాసితులు సంతోషం వ్యక్తం చేశారు.