19-08-2025 12:32:53 AM
సూర్యాపేట, ఆగస్టు 18 (విజయక్రాంతి) :ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, మాజీ భారత క్రికెటర్ ఎం ఎస్ కె ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులకు అకాడమిని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎం ఎస్ కె ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.
క్రీడారంగంలో పేట ఖ్యాతిని జాతీయస్థాయిలో చాటాలన్నారు. పట్టుదలతో ఉద్యమాన్ని నడిపిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధింకాదని అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న క్రీడారంగంలో రాణించాలన్నారు. ఈ అకాడమీతో పేట క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. తదుపరి ఎం.ఎస్.కె ప్రసాద్ తోపాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఫిజికల్ ఫిట్ నెస్ ట్రైనర్ రమేష్ లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.