03-08-2025 12:31:18 AM
యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లు కూడా
న్యూఢిల్లీ, ఆగస్టు 2: మాలేగావ్ పేలుడు కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లు చెప్పాలని దర్యాప్తు అధికారుల బృందం తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అలా చెప్పేందుకు తాను అంగీకరించలేదని, అబద్ధాలు ఆడేందుకు తనకు మనసు రాలేదని ప్రజ్ఞా ఠాకూర్ తెలిపారు.
ఒక మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘మాలేగావ్ కేసులో రామ్ మాధవ్ సహా చాలా మంది పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. అందుకు నన్ను హింసించారు. ఆసుపత్రిలో అక్రమంగా నిర్భంధిం చారు. నేను గుజరాత్‌లో నివసించడం వల్ల ప్రధాని మోదీ పేరు కూడా చెప్పాలని బలవంతపెట్టారు. వాళ్లు నాతో అబద్ధం చెప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం అర్థమై ఎవరి పేర్లు చెప్పలేదు.
మోదీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సంఘ్ సీనియర్ ఇంద్రేశ్ కుమార్ పేర్లు కూడా చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. ఒకవేళ వాళ్ల పేర్లు చెబితే మిమ్నల్ని కొట్టబోమన్నారు. కానీ వారి మాట నేను వినలేదు’ అని ప్రజ్ఞా పేర్కొన్నారు. 2008 సెప్టెంబర్ 29న జరిగిన మాలేగావ్ బాంబు పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా..
వంది మందికి పైగా గాయపడ్డారు. 17 ఏళ్ల పాటు సాగిన విచారణలో ఆధారాలు సరిగ్గా లేవన్న ముం బై ప్రత్యేక కోర్టు కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్ఞా సింగ్, కల్నల్ ప్రశాంత్, శ్రీకాంత్ పురోహిత్ సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.