calender_icon.png 29 May, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే సర్పంచుల ముందస్తు అరెస్టులు ఎందుకు

27-05-2025 03:58:52 PM

కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పనులకే బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

 మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్

హుజురాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే మాజీ సర్పంచ్లను ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారని మాజీ సర్పంచ్ బింగి కర్ణాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారంఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీ బిల్లులు 153 కోట్ల 10 లక్షల వరకు ఉన్న9990 బిల్లులు చెల్లించినట్లు, ఎస్ డి ఎఫ్ గ్రాండ్ కింద 85 కోట్లు చెల్లించినట్లు ప్రకటనల  ద్వారా ప్రగల్ బాలు  పలుకుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులు పనులు కావా ఈ ప్రభుత్వంలో చేసిన పనులకే కాంగ్రెస్ కార్యకర్తలకే బిల్లులు చెల్లిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంలో కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. సర్పంచ్లను ముందస్తు అరెస్టు చేస్తూ మానసికంగా ఆర్థికంగా వంగదీసే  ప్రయత్నం చేస్తుందని రాపోయారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దపెద్ద కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని ఆరోపించారు. వెంటనే బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మనోహర్, లక్ష్మారెడ్డి, తిరుమల- తిరుపతి, నిరోషా -కిరణ్ తో పాటు తదితరులు ఉన్నారు.