01-07-2025 09:59:18 PM
అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): భూభారతిలో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అప్లికేషన్లను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి(District Additional Collector Veera Reddy) అన్నారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో రైతులు రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల అప్లికేషన్లను ప్రస్తుతం పరిష్కరిస్తున్న తీరుపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ దశరథ, డిప్యూటీ తహసిల్దార్ పల్లవి, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి, ఆర్ఐ నగేష్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.