calender_icon.png 23 December, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన పాలకమండలి గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టాలి

23-12-2025 12:00:00 AM

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

పెద్దమందడి డిసెంబర్ 22 : పెద్దమందడి మండలం జగత్ పల్లి గ్రామ సర్పంచ్ పెంటన్న యాదవ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరై పెంటన్న యాదవ్ ని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలకమండలి గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని అన్నారు. గ్రామ ప్రజలు అందించిన విజయాన్నికి కృతజ్ఞతగా గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.

గ్రామంలో సమస్యలను తెలుసుకుంటూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామంలోప్రజా ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయాలనే దిశగా అడుగులు వేస్తుందని, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు చేర్చి గ్రామ సంక్షేమానికి తోడ్పడాలని వారికి సూచించారు. గ్రామ అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిపిసిసిప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, మోహన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.