01-07-2025 10:02:07 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): పద్మశ్రీ వనజీవి రామయ్య జయంతి సందర్భంగా మంగళవారం మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటి వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి విద్యార్థి పాఠశాల ఆవరణలో ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని హెడ్మాస్టర్ అనంతరావు విద్యార్థులకు ఉద్బోధించారు. ఇప్పుడు నాటిన మొక్కలు పెరిగి పెద్దయి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్మోహన్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.