02-10-2025 12:00:00 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్
పాపన్నపేట, అక్టోబర్ 1 :స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని నార్సింగిలో ఎన్నికల కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలు, 40 సర్పంచ్ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంతోష్ చారి, నాయకులు నరేష్, ఇమ్మానియేల్, నాగభూషణం, లక్ష్మణరావు, పెంటయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.