calender_icon.png 20 January, 2026 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటవిక పాలనకు చరమగీతం పాడాలి

19-01-2026 01:24:11 AM

బెంగాల్ టీఎంసీ విముక్త రాష్ట్రం కావాలి

ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం 

కోల్‌కతా, జనవరి 18: పశ్చిమ బెంగాల్ సాగుతున్న ఆటవిక పాలన (జంగిల్‌రాజ్)కు చరమగీతం పాడాలని, రాష్ట్రం టీఎంసీ విము క్త రాష్ట్రం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సింగూరులో ఆదివారం బీజేపీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, సందేశ్‌ఖాలీ వంటి వారు అరాచకాలకు పాల్పడ్డారని, మమతా ప్రభుత్వం మళ్లీ వస్తే, అలాంటి ఘటనలే పునరావృతం అవుతాయని హెచ్చరిం చారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని బట్టి రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత ఉందో అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ మాఫియా చేతుల్లో చిక్కుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అవినీతి కారణాంగా వేలాది మంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. తృణమూల్ కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అక్రమ చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వేస్తోందని ఆరోపించారు. సరిహద్దుల వద్ద ఫెన్సింగ్ వేయడానికి రాష్ట్రప్ర భుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. చొరబాటుదారులకు నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చి దేశ భద్రతతో ఆడుకుంటున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు.

బెంగాల్‌ను అభివృద్ధి పథంలో నడవాలంటే అందుకు తమ డబుల్ ఇంజిన్ సర్కార్ పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘హర్ ఘర్ జల్’ వంటి పథకాలను సీఎం మమత అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మోదీ ఆదివారం అస్సాంలోనూ పర్యటించారు. ఉదయం ఆయ న కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైందని ఎద్దేవా చేశారు.