calender_icon.png 30 July, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం

06-12-2024 12:27:30 AM

మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్

మహబూబాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. ఈక్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందని మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్ నాయకులు ఏటీఎం కార్డులాగా వాడుకున్నారని ఆయన మండిపడ్డారు. మహబూబా బాద్‌లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్టీసీ నష్టాల్లో ఉండేదని.. తమ ప్రభుత్వం వచ్చాకే లాభాల బాట పట్టిందన్నారు. అప్పుల కుప్పగా ఉన్న తెలంగాణను క్రమశిక్షణతో సరిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట డీసీసీ ఉపాధ్యక్షుడు, జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు, పాల్గొన్నారు.