02-01-2026 12:00:00 AM
2024 బడ్జెట్‌లో ఎంజీనరేగా కింద కేంద్ర ప్రభుత్వం 86 వేల కోట్ల కేటాయించడం జరిగింది. మార్పు చర్య అనేది కేవలం ఒక పథకం పేరు మార్చడం కాదని, గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న ‘సిద్ధాంత పరమైన దాడి’గా విపక్షాలు వాదిస్తున్నాయి.
యూపీఏ హయాంలో తీసుకొచ్చిన మహాత్మా గాం ధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం.. ‘వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్’ (వీబీ జీ -రామ్-జీ) చట్టాన్ని 2025 అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త పథకాన్ని వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి కోసం తీసుకొచ్చినట్లు సర్కార్ పేర్కొంది. 2009 ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని మహాత్మాగాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(నరేగా)లో చేర్చి యుపీఏ ప్రభుత్వం లబ్ధి పొందిందని, పెరుగుతున్న పేదరికం, డిజిటల్ యాక్సిస్, నిధుల దుర్వినియోగం, బలహీనమైన పర్యవేక్షణ విధానాలు ఈ పథకం పని తీరును నీరుగార్చాయని, పథకం అమల్లోని సవాళ్లను ఎత్తి చూపారు.
అధికారిక సమాచారం మేరకు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 193.67 కోట్ల దుర్వినియోగమయ్యాయని, గ్రామీణ కుటుంబల్లో కేవలం 7.61 శాతం మాత్రమే ఎంజీనరేగా కింద 100 రోజుల పనిని పూర్తి చేశారు. కొత్త చట్టం మరింత దృష్టి కేంద్రీకరించి జవాబుదారీతనం, సాంకేతిక ఆధారిత వ్యవస్థతో భర్తీ చేయడమే తమ లక్ష్యమని ఎన్డీయే ప్రభు త్వం వాదిస్తున్నది. 2024 బడ్జెట్‌లో నరేగా కింద కేంద్ర ప్రభుత్వం 86 వేల కోట్ల కేటాయించడం జరిగింది.
మార్పు చర్య కేవ లం ఒక పథకం పేరు మార్చడం కాదని, గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న‘సిద్ధాంత పరమైన దాడి’గా విపక్షాలు వాదిస్తున్నాయి. గత కొన్నేళ్ళుగా బీజేపీ ప్రభుత్వం ఈ పథకానికి నిధులు నిలిపివేస్తూ, తగ్గిస్తున్నదని ఆరోపించాయి. ఈ పథకం ఉనికిని, ఆత్మను దెబ్బ తీసేందుకే పేరు మార్పు చేయడమే గాక కేవలం శ్రమ, గౌరవానికి పేదల హక్కులకు ప్రతికగా నిలిచిన గాంధీ పేరును పథకం నుంచి తొలగిం చడం ఆయన గ్రామ స్వరాజ్ ఆశయాలకు విస్మరించినట్లే అవుతుందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. భారతదేశ పల్లెలను తమ శ్రమతో నిలబెడుతున్న కోట్లాదిమంది ఉపా ధి కార్మికులను ఈ నిర్ణయం అవమానించేలా ఉందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
రాష్ట్రాలపై భారం..
కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గ్రామంలో అమల్లో ఉన్న ఈ పథకం ఇప్పటివరకు 250 మిలియన్ల మంది నమోదు కాగా 143.3 మిలియన్ల మంది నిరంతరం పనిచేస్తూ క్రియాశీల ఉపాధిని పొందుతున్నారు. దేశవ్యాప్తంగా 2.69 లక్షల గ్రామ పంచాయితీలు 7వేలకు పైగా బ్లాకులు, 700కు పైగా జిల్లాలో ఈ పథకం లబ్ధిదారులు ఉన్నారు. తెలంగాణలో కోటి 20 లక్ష ల జాబ్ కార్డులు ఉన్నాయి. 12 లక్షల కార్డులను తీసివేసే దశలో కేవైసీ బ్యాంకు ఖాతా లకు రావడం లేదు. రిమోట్ ఏజెన్సీ ఏరియాలో, గిరిజన ప్రాంతాల్లో టెలిఫోన్ సిగ్న ల్స్ లేకపోవడం, లబ్ధిదారులకు ఫోన్ లేకపోవడం, ఉన్నా ఆధార్ కార్డుతో లింక్ అయిన ఆ ఫోన్ నెంబరు పనిచేయకపోవడం కేవైసీ చేసే సమయంలో ఓటీపీ సమస్యలు ప్రజల ను ఇబ్బంది పెడుతున్నాయి.
తెలంగాణలో గతంలో ప్రభుత్వం 2024 ఆర్థిక సంవత్సరంలో 1250 కోట్ల పని దినాలు ఇచ్చేవి. 2025 ఆర్థిక సంవత్సరంలో 650 కోట్ల పని దినాలకు అంటే సగానికి తగ్గించడం జరిగింది. పైగా కొత్త చట్టంలో పని దినాలను రెట్టింపు చేయడంతో పాటు 40 శాతం ఖర్చును రాష్ర్ట ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పాత బకాయిలు మే నుండి సెప్టెంబర్/అక్టోబర్‌కు రాష్ర్టం 500 కోట్ల ఉపాధి కూలీలకు బకాయిలతో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయం లోపంతో వేతన రాకపోవడం సిబ్బందిని నిరదీయడంతో మానసిక ఒత్తిడికి ఇప్పటికే గురవుతున్నారు. ఇందిరమ్మ హౌసింగ్ పథ కం కింద 28,600 మంది కూలీలకు నరేగా కింద 90 రోజుల పని దినాలు అంచనా డిమాండ్ చేసి ప్రతిరోజు ఫోటోలు తీసి పేమెంట్ చేయాలి, ప్రస్తుతం ఈ పథకం జీ-రామ్-జీగా మార్చడంతో ఉపాధిలో చెల్లిం పులు జరిగేనా!
అటకెక్కుతుందా?
పది మంది కూలీలకు ఒక మాస్టర్ ఉంటారు. అందులో ఒక కూలికి కేవైసీ కాకపోతే ఆ ఒక్కరి వల్ల అందరి పేమెంట్‌లు ఆగిపోతున్నాయి. కానీ దీనిని తిరిగి మూడు రోజుల్లో పేమెంట్ చేయాల్సిందే. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (ఎన్‌పీసీఐ) తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల కేవైసీల సమస్యలు పెరిగిపోయాయి. దీంతో దాదాపు 12 లక్షల మంది జాబ్ కార్డులు కోల్పోవాల్సి వచ్చిం ది. కేవలం ఈ కారణంతోనే జాబు కార్డులు కోల్పోయిన వారి సంఖ్య 90 శాతం ఉండ డం గమనార్హం.
వీజీ- రామ్- జీ పథకంలో పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగింది. ఉపాధి కూలీకిచ్చే కూలి రూ. 240 నుంచి రూ. 307కు పెంచడం జరిగింది. ఎంజీనరేగా పథకం కింద పని అడిగే హక్కు చట్టం నుం చి అధికారుల దయదాక్షిణ్యల మీద ఆధారపడే ఉపాధి పథకంగా జీరామ్‌జీగా మారి పోయినట్లయింది. ఈ మార్పిడితో కేంద్ర వాటా 60:40 శాతంగా ఉండడం తో రాష్ట్రాలపై బడ్జెట్ భారం పడినట్లయిం ది. దీంతో రాష్ర్ట ప్రభుత్వాలకు ఇది అదనపు భారంగా భావించొచ్చు. అయితే ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90: 10 నిష్పత్తిని వర్తింపజేశారు. కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రం 100 శాతం నిధుల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
ఉదాహరణగా చూసుకుంటే ఒక జాబు కార్డుకు రూ.307. అలాగే 125 రోజుల పని కల్పిస్తే ఒక్కో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.15,350 అదనపు భారంగా పడనుంది. జాబ్ కార్డులతో సరి చేయగా 250 కోట్లు అదనంగా రాష్ర్టం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా 50 రోజులు అంటే 40 శాతం పని దినాలు రాష్ర్టం కల్పించిన అనంతరం 60 శాతం నిధుల్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఒకవేళ రాష్ర్ట ప్రభుత్వం 50 రోజుల పని దినాలు కల్పించకపోతే మాత్రం కేంద్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయదు. దీనితో రాష్ర్ట ప్రభుత్వాలు నిధుల భారంతో ఈ పథకాన్ని అటకెక్కించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఉంది.
భవిష్యత్తు ప్రశ్నార్థకం..
కేంద్ర నుంచి వచ్చిన వీజీ రామ్ జీ చట్టం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఏం టంటే.. కార్మికుల ఆదాయ నిశ్చయత తగ్గుతుంది. మహిళలకు స్థానికంగా అనువైన ఉపాధి తగ్గుతుంది; ఆదివాసీలకు వేసవిలో ప్రధాన జీవనోపాధి బలహీనమవుతుంది; ఎస్సీ/ఎస్టీ కార్మికుల కొనుగోలు శక్తి తగ్గుతుంది; వృద్ధులు, వికలాంగులకు అందు బాటులో ఉన్న పని అవకాశాలు మరింత తగ్గే ప్రమాదం ఉంది. చట్టపరమైన హామీ లేకపోతే, ఉపాధి ‘హక్కు’ నుంచి ప్రభుత్వం ‘విచక్షణ’గా మారుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కోల్పోతుంది. నరేగా వేతనాలు నేరుగా గ్రామీణ మార్కెట్లలోకి ప్రవ హించి వినియోగాన్ని నిలబెట్టాయి. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో అవే పెద్ద మద్దతయ్యాయి.
ఇది లేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత పెళుసుగా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 30 వేల మంది సిబ్బంది (ఫీల్ అసిస్టెంట్లు, మేట్స్, టెక్నికల్ సిబ్బంది) నరేగాతో అనుసంధానమై ఉన్నారు. కార్మికులకు పను లు/వేతనాలు సక్రమంగా అందేందుకు వీరే సంస్థాగత వెన్నెముక. కొత్త చట్టం వీరి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతుంది. ఇది జీవనోపాధిని, కార్మిక మార్కెట్లను, అలాగే కష్టపడి నిర్మించిన పాలనా నిర్మాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే ఉపాధి హామీ ఒక సంక్షేమ పథకం కాదు. గ్రామీణ భారతదేశంలో సామాజిక న్యాయాన్ని చట్టబద్ధంగా అమలు చేసిన అరుదైన హామీ అది. ‘వీబీ జీ రామ్ జీ’ చట్టం ఎలాంటి మినహాయింపులు లేకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో పూర్తిగా అమలయ్యే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సెల్: 9492700653
తూము విజయ్‌కుమార్