calender_icon.png 29 October, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకాంక్షిత బ్లాక్ లో చేపట్టిన పనులపై పురోగతి సాధించాలి

28-10-2025 06:42:54 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆకాంక్షిత బ్లాక్లో భాగంగా జిల్లాలోని తిర్యాణి మండలంలో చేపట్టిన పనులపై పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారితో కలిసి తిర్యాణి మండలంలో చేపట్టిన కార్యక్రమాలపై విద్య, వైద్య, శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆకాంక్షిత బ్లాక్ లో భాగంగా తిర్యాణి మండలంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి పనుల పురోగతిపై పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

పాఠశాలలో మౌలిక వసతులు, కంప్యూటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రోగులతో పాటు వచ్చే వారి కోసం వెయిటింగ్ గదుల నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరికరాలు, ఆరోగ్య కార్యకర్తలకు ట్యాబులు పంపిణీ, సిద్ధమైన నీరు అందించేందుకు ఆర్. ఓ. ప్లాంట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతులు, నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యత శిక్షణ అందించడం, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.

మండలంలో చేపట్టవలసిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్, ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, విద్యాశాఖ ప్రణాళిక సమన్వయకర్త ఆబిద్ అలీ, తిర్యాణి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్లేష్, పంచాయతీరాజ్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.