25-03-2025 12:00:00 AM
ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాంధాన్
నిజామాబాద్, మార్చ్ 24, (విజయ క్రాంతి) : జర్నలిస్టులు మతసామరస్యానికి ప్రతీక గా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీ యమని అన్నారు తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అందాన్ అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకుని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. మత పెద్దల ఆధ్వర్యంలో మతబోధనలు మత ప్రార్థనలు నిర్వహించారు.
కార్యక్రమంలో తాహెర్ బిన్ హాందాన్ తో పాటు మాజీ కార్పొరేటర్ ఖుద్దుస్ సీనియర్ నాయకులు జావీద్ అక్రమ్ బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు మునీర్ రషీద్ జర్నలిస్టులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం లో ముస్లిం మైనారిటీ ల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం భినందనీయమని తాహెర్ బిన్ హందాన్ కొనియా డారు. హిందూ ముస్లిం లు సోదర భావంతో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్ సీనియర్ జర్నలిస్టులు జి ప్రమోద్, పాకాల నరసింహులు, మండే మోహన్, మాజీద్ సందీప్, కర్క రమేష్, లోక రవి, కార్యవర్గ సభ్యులు హైమద్ సీనియర్ జర్నలిస్టులు, మైనార్టీ సోదరులు, ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్నారు