calender_icon.png 20 January, 2026 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైళ్ల శాఖలో పదోన్నతులు

20-01-2026 02:04:07 AM

ఇద్దరు అధికారులకు ప్రమోషన్

కుషాయిగూడ, జనవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ జైళ్ల శాఖలో ఇద్దరు అధికారులకు పదోన్నతి లభించింది. ఈ ఉత్తర్వులను తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిత్ర సోమవారం విడుదల చేశారు. నలగొండ జిల్లా జైలు అధికారిగా విధులు నిర్వహించిన ప్రమోద్‌కు చర్లపల్లి సెంట్రల్ జైల్ సూపరిండెంట్‌గా పదోన్నతి లభించింది.

ఇదే క్రమంలో చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు డిప్యూటీ సూపరిండెంట్‌గా ఉన్న భరత్‌కు అదే ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించారు. తాజా నియామకాలతో చర్లపల్లి జైల్ పరిపాలన మరింత సమర్థంగా కొనసాగుతుందని అధికారులు అభి ప్రాయపడ్డారు.