22-12-2025 01:00:54 AM
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి
నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు, డిసెంబర్ 21 : సర్పంచి పదవి అనేది గ్రామానికి చుక్కాని లాంటిదని తన, పర బేధాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ గ్రామ అభివృద్ధికి గెలిచిన సర్పంచులు, వార్డ్ మెంబర్లు తోడ్పడాలని, ఎన్నికల వరకే పార్టీలు అని ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలకతీతంగా నిరుపేదలకు అండగా నిలవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడత మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులు,వార్డ్ మెంబర్లను సన్మానించి అభినందనలు తెలిపారు.
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయం లో మునుగోడు, ఘట్టుప్పల్, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల నూతన సర్పంచులు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ని నారాయణ పూర్, చౌటుప్పల్ మండలాల గెలిచిన గ్రామ సర్పంచులను, వార్డ్ మెంబెర్ లను ప్రతి ఒక్కరికి శాలువాలు కప్పి సన్మానించి అభినందనలు తెలిపి మాట్లాడారు.అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు.
గ్రామ ప్రథమ పౌరుడిగా, పౌరురాలిగా ప్రతి ఒక్కరికి కష్టసుఖాలలో అందుబా టులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల ముఖ్య నాయకు లు నూతనంగా ఎన్నికైన సర్పంచులు వార్డ్ మెంబర్లు మునుగోడు లోని క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో క్యాంపు కార్యాల యం అంతా కోలహలంగా మారింది.ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ముఖ్య నాయకులు ఆయా గ్రామాల ముఖ్య కార్యకర్తలతో పాటు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.