23-08-2025 05:30:42 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శనివారం భోజన విరామ సమయంలో నలబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూరపాటి రవీందర్,కాకి సీనయ్యలు మాట్లాడుతూ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని,పెండింగ్లో ఉన్న డీఎలు వెంటనే విడుదల చేయాలని,సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుంభం ప్రభాకర్ తోపాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.