08-08-2025 12:19:51 AM
ఢిల్లీలో సీఎం రేవంత్‌కు డీజేహెచ్‌ఎస్ విన్నపం
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): తెలంగాణలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) కోరింది. ఈ మేరకు ఢిల్లీలో గురువారం డీజేహెచ్‌ఎస్ అధ్యక్షుడు బొల్లోజు రవి, డైరెక్టర్ ప్రతాపరెడ్డి, సభ్యులు నవీన్ దుమ్మాజీ, సతీష్ యాదవ్ తదితరులు ఆయన నివాసంలో కలిశారు.
ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇళ్ల స్థలాలు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఎలాగైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బొల్లోజు రవి, ప్రతాప్‌రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.