14-03-2025 01:36:28 AM
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): తెలంగాణ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొత్తు కాదని, ఉద్యమకారులను తొక్కేసిన చరిత్ర కేసీఆర్‌ది అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి మండిపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం ఆ మె మీడియాతో మాట్లాడారు. టీడీపీలో తన కు మంత్రి పదవి ఇవ్వలేదనే, కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకు న్నారన్నారని తెలిపా రు.
కేవలం దొరలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా లేరని, ఇప్పటికైనా ఆయన బ డుగు, బలహీన వర్గాలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను ఆస్తులు అమ్మానని, కేసీఆర్ మాత్రం ఉద్య మం పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీ ము న్ముందు తెలంగాణ వ్యతిరేక శక్తులను రాష్ట్రంలోకి దింపాలని చూస్తున్నదని, ఆ కుట్రలను కాంగ్రెస్ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు.
మస్టర్ కోసమే అసెంబ్లీ కేసీఆర్: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
మస్టర్ కోసమే ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని, ప్రజల కోసం మాత్రం కాదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. స్ట్రేచర్ గురించి నియంతలే మాట్లాడతారని, అందుకే హిట్లర్ వంటి వాడు అబద్ధాల ప్రచారం కోసమే ప్రత్యేకంగా మంత్రిని నియమించుకున్నాడని గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్ అదే చేస్తున్నారని దుయ్యబట్టారు.