calender_icon.png 13 May, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

25-03-2025 12:12:20 AM

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్

ముషీరాబాద్, మార్చి 24: (విజయక్రాంతి):  మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ వేతనాల విడుదలకై, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేలు వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెల లు గడుస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫల విఫలమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 నెలల నుండి కోడిగుడ్ల బిల్లులు, 3 నెలల నుండి వేతనాలు బకాయి లు ఉన్నాయని, ఒకపక్క వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలని  కార్మికులను అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, బిల్లులు చెల్లించక పోవడంతో కార్మికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మధ్యాహ్న భోజ న పథకం కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్, వై.లక్ష్మి, కృష్ణమాచారి, పద్మ, మాయ, చామంతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.