23 August, 2026 | 6:55 PM

Breaking News

వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •  

ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

01-09-2025 07:54 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు ప్రజలు 179 వినతులను అందజేశారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరగా ఆ సమస్యలను పరిష్కరించాలని అక్కడే ఉన్న జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే ప్రజావాణి కార్యక్రమం నాటికి వినతులను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, పలు శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.