calender_icon.png 13 May, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్ణీత గడువులోగా ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

13-05-2025 12:46:24 AM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల, మే 12 (విజయక్రాంతి): ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించా లని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సము దాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో కలెక్టర్ నేరుగా మాట్లా డి, వారి సమస్యలను సానుకూలంగా స్పం దించారు. ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. బిఈ  కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికా రులు , మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.