12-09-2025 11:52:00 PM
మందమర్రి,(విజయక్రాంతి): ఏరియా సింగరేణి నూతన జిఎం గా బాధ్యతలు చేపట్టిన ఎన్ రాధాకృష్ణ ను టిడిపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. శుక్రవారం జిఎం కార్యాలయం లోని ఆయన చాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మందమర్రి (వి) గ్రామం లోని రాళ్లవాగుపై సింగరేణి నిధులతో వంతెన నిర్మించాలని జీఎం దృష్టికి తీసుకు రాగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు టిడిపి నాయకులు తెలిపారు.