08-08-2025 12:00:00 AM
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
పెన్ పహాడ్, ఆగస్టు 7 : పేద ప్రజలు, విద్యార్థుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని అందులో భాగంగానే సర్కార్ బడులలో నాణ్యమైన భోజనం తో పాటు విద్య.. వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడి సెంటర్లను పరిశీలించి ఆ తర్వాత అనంతారం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ బృందంతో కలిసి పరిశీలించి ఆయన మాట్లాడారు.
ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని ఆసుపత్రి విభాగాలను పరిశీలించి అంశాలపై స్థానిక వైద్యాధికారి డాక్టర్ రాజేష్ తో నివృత్తి చేసుకున్నారు. అంగన్వాడి సెంటర్ లోని చిన్నారులకు ఏ ఏ ఆటలు ఆడిపిస్తున్నారని.. పిల్లలకు అందించే గుడ్ల నాణ్యత సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా అనంతారం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పరిశీలించి మొక్కలు నాటి నీటిని అందించారు.
కార్యక్రమంలో బృందం సభ్యులు శారద జ్యోతి భారతి డిఇఓ అశోక్, డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, ఆయా శాఖల జిల్లా అధికారులు అప్పారావు, ప్రసాద్, మోహన్ రావు, శంకర్ రెడ్డి, దయానందరాణి, మల్లేష్, శ్రీనివాస్, ఎంఈఓ రవి, మండల వైద్యాధికారి రాజేష్, సిడిపిఓ కిరణ్మయి, హెచ్‌ఎం మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.