06-05-2025 12:00:00 AM
మలక్‌పేట్, మే 5: హైదరాబాద్ రేస్ క్లబ్‌తో కలసి రేస్2విన్ ఫౌండేషన్ మలక్‌పేట్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆధునీకరిం చి, నూతనంగా రూపుదిద్దిన స్మార్ట్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రముఖ సినీ నటి రెజినా కసాండ్రా, రేస్2విన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై. గోపీరావు ప్రారంభించారు. పిల్లల మేధస్సు, భావోద్వేగ అభివృద్ధికి అనుకూలంగా ఉండేలా కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
రేస్2విన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగురంగుల గోడలతో ఆకర్షణీయం గా మలచబడిన ఈ కేంద్రం, చిన్నారులకు ఉత్సాహాన్ని కలిగించేలా ఉంది. ముఖ్యంగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ కోసం పెద్ద ఫ్లాట్-స్క్రీన్ ఎల్‌ఈడీ టీవీ, మృదువైన కార్పెట్లు, ధ్వని-చిత్రాల ఆధారిత శిక్షణా పరికరాలు ఏర్పా టు చేశారు. ఇవన్నీ పిల్లల భాషా నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయని గోపిరావు తెలిపారు.
ఈ సందర్భంగా నటి రెజినా కసాండ్రా మాట్లాడుతూ, “పిల్లల అభివృద్ధికి పాజిటివ్ లెర్నింగ్ స్పేస్ ఎంతో అవసరం. రేస్2విన్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం ద్వారా గొప్ప మానవతా దృష్టిని చాటింది” అని అన్నారు. వై. గోపీ రావు మాట్లాడుతూ తమకు సమాజంపై ఉన్న బాధ్యతకు సూచకమని అన్నారు. చిన్నారులకు మంచి విద్యా వాతావరణం కల్పించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.