09-07-2025 12:25:22 AM
ఎల్బీనగర్, జులై 8 : మహిళలకు రాచకొండ షీ టీమ్స్ అండగా, రక్షణగా ఉంటాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 15 రోజుల్లో 185 మంది పోకిరీలను షీ టీమ్స్ పోలీసులు పెట్టుకున్నారని చెప్పారు. బాలికలు, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సీపీ సుధీర్ బాబు సూచించారు.
రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్ల కు మంగళవారం రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ క మిషనరేట్ పరిధిలో మహిళలు, యువతులను వేధింపులకు గురిచేస్తున్న 185 (మేజర్స్-139 ,మైనర్స్-46 ) మందిని షీ టీమ్స్ పట్టుకున్నారు. వీరికి ఎల్బీనగర్ లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసులో కౌన్సిలర్లు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
గత నెల తేదీ 16 నుంచి 30వ తేదీ వరకు 215 పిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫోన్ల ద్వారా వేధించినవి -37, సోషల్ మీడియా ద్వారా ద్వారా వేధించినవి-79 , నేరుగా వేధించినవి 99 ఉన్నాయి. వా టిలో క్రిమినల్ కేసులు-9, పెట్టి కేసులు-105, మరియు 78 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి.ఉషారాణి తెలిపారు.
అవగాహన కార్యక్రమాలు జూన్ 16 నుంచి 30వ తేదీ వరకు షీ టీమ్స్ రాచకొండ మొత్తం 82 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 20 480 మందికి మహిళా చట్టాలు, మహిళల హక్కులు, నేరాలు, జాగ్రత్తలను వివరించి అవగాహన కల్పించారు.
మహిళలు వేధింపులకు గురైయినప్పుడు రాచకొండ వాట్సాప్ నెంబర్ 871 2662111 ద్వారా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి, ఇన్స్ స్పెక్టర్లు ఎం.ముని, జె.హనుమంతు, జి.అంజయ్య, అడ్మిన్ ఎస్త్స్ర రాజు, షీ టీమ్స్ సిబ్బంది, కౌన్సిలర్స్‌పాల్గొన్నారు.