05-05-2024 12:10:00 AM
ఎన్నికల అఫిడవిట్‌లో రాహుల్
న్యూఢిల్లీ, మే 4: తనకు సొంత కారు కానీ, సొంతిల్లు కానీ లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా పోటీగా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, తనకు మొత్తం రూ.20 కోట్ల ఆస్తి ఉందని, అందులో రూ.4.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన చరాస్తుల విలువ రూ.9,24,59,264 అని, అందులో రూ.4,33,60,519 విలువైన షేర్లు ఉనాయని, రూ.3,81,33,572 విలువైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయని వివరించారు. కాగా, 26,25,157 బ్యాంకు బ్యాలెన్స్ ఉందని, రూ.15,21,740 విలువైన గోల్డ్ బాండ్స్ ఉన్నాయని తెలిపారు.