09-08-2025 03:11:55 AM
-రాత్రి ఒక్కసారిగా కురిసిన వాన
-రాబోయే 6 రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి ప ది గంటల సమయంలో పలు ప్రాం తాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని సైదాబాద్, సరూర్‌నగర్, దిల్ సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, చంపాపేట్, నాంపల్లి, బండ్ల గూడ, అంబర్‌పేట, పాతబస్తీ, చాదర్‌ఘాట్, చంద్రయాణగుట్ట, బహ దూర్‌పు, శాలిబండ ప్రాంతాల్లో వ ర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
6 రోజులు భారీ వర్షాలు
వచ్చే 6 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నాగర్‌కర్నూల్, వనప ర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.