calender_icon.png 7 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లో ఆడేది లేదు

05-01-2026 12:00:00 AM

  1. ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు లేఖ
  2. శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి
  3. అంత ఈజీ కాదంటున్న బీసీసీఐ
  4. రంగంలోకి ఐసీసీ

ఢాకా, జనవరి 4 : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా ఐపీఎల్ నుం చి ఆ దేశ క్రికెటర్లను అనుమతించకూడదని బీసీసీఐ తీసుకుంది.దీనిలో భాగంగానే ముస్తాఫిజుర్ రహమాన్‌ను విడుదల చేయాలని కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు ఆదేశాలివ్వడం, వెంటనే కేకేఆర్ కూడా అతన్ని జట్టును రిలీజ్ చేసేయడం జరిగాయి. ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతీకార చర్యలకు దిగింది.

వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టు భారత్‌కు వచ్చేది లేదని స్పష్టం చేసింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌ల వేదికలను భారత్ నుంచి మార్చాలని ఐసీసీకి లేఖ రాసింది. ఈ మొత్తం వ్యవహారం వెను క బంగ్లాదేశ్ క్రీడామంత్రిత్వ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించారని ప్రకటన వచ్చిన వెంట నే బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాజారు ఆసిఫ్ నజ్రుల్ రంగంలోకి దిగారు.

భారత్‌లో ఆడమంటూ వెంటనే ఐసీసీకి లేఖ రాయాల ని తమ దేశ క్రికెట్ బోర్డును ఆదేశించారు. రూ.9.2 కోట్ల ఒప్పందం ఉన్నప్పటకీ రాజకీయ కారణాలతోనే ముస్తాఫిజుర్‌ను తప్పించారని, ఇది బంగ్లా ఆటగాళ్లను అవమా నించడమే నని నజ్రుల్ ఆరోపిస్తున్నారు. ఒక స్టార్ ప్లే యర్‌కు భారత్‌లో రక్షణ లేనప్పుడు మొత్తం జాతీయ జట్టు పర్యటించడం క్షేమం కాదని చెబుతున్నారు. బానిసలా పడి ఉండే రోజులు ఎప్పుడో ముగిసాయంటూ రెచ్చగొట్టే వ్యా ఖ్యలు చేశారు. నజ్రుల్ ఆదేశాలతో బంగ్లా క్రికెట్ బోర్డు ఆఘమేఘాల మీద ఐసీసీకి లేఖ రాసింది.

తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరింది. దీని పై ఐసీసీ ఇంకా స్పందించలేదు. ఇటీవల జరిగిన మినీ వేలంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ముస్తాఫిజుర్‌ను రూ. 9.2 కోట్లతో కొనుగోలు చేసింది. అప్పటికి బంగ్లాలో పరిస్థితులు సాధార ణంగానే ఉన్నాయి. వేలం ముగిసిన కొన్ని రోజులకు హిందువులపై దాడులు పెరగడం, నలుగురు హత్యకు గురవడం వంటి పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. అటు భార త మహిళల జట్టుతో సిరీస్‌ను కూడా బీసీసీఐ రద్దు చేసింది. అయితే ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడించొద్దంటూ పలు రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాయి. 

పరిస్థితి చేయి దాటకూడదన్న ఉద్దేశంతో బీసీసీఐ ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయాలని ఆదేశాలిచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య పరిశీలిస్తున్నట్టు స మాచారం. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా బీసీసీఐ మాజీ సెక్రటరీ జైషానే వ్యవహరిస్తు న్నారు. రెండు దేశాలకు ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించే దిశగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లా క్రికెట్ బోర్డు రిక్వెస్ట్ మేర కు వారి మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే లాజిస్టిక్స్ పరంగా ఉన్న సమస్యలు, షెడ్యూల్‌కు ఇబ్బంది లేకుండా చూడడం ఇక్కడ సవాల్‌గా మారింది.

ప్రస్తుతం ఐసీసీ దీనిపై బీసీ సీఐతోనూ, శ్రీలంక క్రికెట్ బోర్డుతోనూ చర్చించి నిర్ణయానికి రానుంది. కాగా ముం దు ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ మొత్తం 4 లీగ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడాల్సి ఉంది.  ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌లకు కోల్‌కత్తానే వేదిక. ఫిబ్రవరి 17న నేపాల్‌తో మ్యాచ్‌కు ముంబై వేదికగా ఉంది. ఇప్పుడు ఈ నాలుగు మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చడంపై ఐసీసీ తర్జన భర్జన పడుతోంది.

ఇష్టానుసారం మార్చడం కుదరదు : బీసీసీఐ

మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి రాసిన లేఖపై బీసీసీఐ తీవ్రం గా స్పందించింది. ఇష్టానుసారం మ్యా చ్‌ల వేదికలను మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.టోర్నమెంట్‌కు ఇంకా నెలరోజుల సమయమే ఉందని, ప్రయాణపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. బంగ్లాదేశ్‌తో ఆడే ఇతర జట్ల గురించి కూడా ఆలోచించాలని, ఇప్పటికే వారి విమా న టికెట్లు, బస చేసే హోటల్స్, ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయని గుర్తు చేసిం ది. బ్రాడ్‌కాస్టింగ్‌లోనూ చాలా సమస్యలు వస్తాయని, మ్యాచ్‌ల తరలింపు ప్రక్రియ అనుకున్నంత ఈజీ కాదని బీసీసీఐ తేల్చి చెప్పింది.