calender_icon.png 4 October, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యసభ సభ్యుడు రవిచంద్రకు అభినందనల వెల్లువ

04-10-2025 12:07:05 AM

మహబూబాబాద్, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా  మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఎన్నికవ్వడంతో హర్షం వ్యక్తం అవుతుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామక ప్రక్రియలో భాగంగా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మరోసారి పెట్రోలియం సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఈ మేరకు లోక్ సభ డిప్యూటీ సెక్రెటరీ సుజయ్ కుమార్ శుక్రవారం నియామాక ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 31 మంది సభ్యులు గల ఈ కమిటీలో లోక్ సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ప్రాతినిద్యం వహిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి నియామాకం అయ్యే ఈ కమిటీకి రవిచంద్ర వరుసగా మూడోసారి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ దఫా పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా లోక్ సభ ఎంపీ సునీల్ దత్తాత్రేయ తట్కరే కొత్తగా ఎన్నికయ్యారు.