09-08-2025 05:09:56 PM
రాఖీ సందర్భంగా ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్..
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): తిప్పాపూర్ బస్టాండ్‌లో డిపో మేనేజర్ శ్రీనివాస్(Depot Manager Srinivas) ఆధ్వర్యంలో రాఖీ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు పరస్పరం రాఖీలు కట్టుకొని ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బందితో కలిసి రాఖీ పండగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఇంటిదగ్గర పండగ జరుపుకోవాలని బాధాకరమైనప్పటికీ వారికి ఆ లోటు లేకుండా ప్రతి సంవత్సరం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. రాఖీ పండుగను పురస్కరించుకొని బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సోదరులకు రాఖీ కట్టేందుకు సోదరీమణులు బయలుదేరిన నేపథ్యంలో వేములవాడ బస్టాండ్ కిక్కిరిసిపోయింది.