calender_icon.png 1 February, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవలపిల్లలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్ దంపతులు

01-02-2026 01:16:32 AM

సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఉపాసన మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని.. తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన జంటకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే. ఈ వార్తతో మెగా అభిమానులు సంతోషంలో తేలియాడుతున్నారు.

ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: చిరంజీవి దంపతులు

ఈ మధుర క్షణాలను చిరంజీవి, సురేఖ దంపతులు అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ‘రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు కవలలు.. ఒక మగబిడ్డ, ఒక ఆడపిల్ల - జన్మించారు. ఈ వార్తను మేము మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. పిల్లలు, తల్లి.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.. బాగానే ఉన్నారు. ఈ చిన్న పిల్లలను మా కుటుంబంలోకి స్వాగతించడం మాకు దేవుళ్ల ఆశీర్వాదంగా భావిస్తున్నాం. మాపై ప్రేమ చూపుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని వారు రాసుకొచ్చారు.