27-05-2025 12:28:26 AM
సర్విస్ రోడ్ పనులు పరిశీలనలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం మే26 (విజయక్రాంతి); రామగుండం హైవే సర్వీస్ రోడ్ ను రూ. 25 కోట్ల తో అభివృద్ధి పనులు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.
సోమవారం హైవే లో చేపట్టిన సర్వీస్ రోడ్ విస్తరణ పనులను స్వయంగా ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పనులకు సుమారు రూ. 25 కోట్లు ఖర్చు అవుతుందని, నగర రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఆర్ అండ్ బి (రోడ్స్ అండ్ బిల్డింగ్స్) శాఖ, సింగరేణి మున్సిపల్ అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో కలిసి పనుల పురోగతిని పై సమీక్షించా రు.రామగుండం హైవే అనేది స్థానిక ప్రజలకు మాత్రమే కాదు, పారిశ్రామిక అవసరాలకూ కీలక మార్గమని, ట్రాఫిక్ భద్రత, వాహనదారుల సౌకర్యం కోసం సర్వీస్ రోడ్ విస్తరణ ఎంతో అవసరమని, ప్రభుత్వ అభివృద్ధి పథకాల్లో ఇది ఒక ముఖ్యమైన ముందడుగని ఎమ్మెల్యే వ్యాఖ్యా నించారు.
స్థానిక ప్రజలు అభివృద్ధి పనులను హర్షంగా స్వీకరిస్తున్నారని, ప్రజా సహకారంతో రామగుండం మరింత అభివృద్ధి మార్గంలో దూసుకెళ్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వివిధ శాఖల అధికారులుపాల్గొన్నారు.