16-06-2025 11:20:34 PM
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పునర్విభజనపై సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..
రామగుండం (విజయక్రాంతి): 60 డివిజన్ లుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) అన్నారు. సోమవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పునర్విభజనపై జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం ఇన్చార్జి కమిషనర్ అరుణశ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రామగుండం కార్పొరేషన్ లో లింగాపుర్, వెంకటరావు నగర్, ఎఫ్.సి. ఐ .ఎల్కలపల్లి గేట్, అక్బర్ నగర్ గ్రామాలు విలీనమైన నేపథ్యంలో 50 డివిజన్ లు ఉన్న కార్పొరేషన్ ను 60 డివిజన్ లుగా పునర్విభజన చేయాలని సిడిఎంఏ సూచించిందని అన్నారు. 60 డివిజన్ లుగా రామగుండం కార్పొరేషన్ పునర్విభజన డ్రాఫ్ట్ ను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటి ప్లానర్ శ్రీహరి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నవీన్, రెవెన్యూ అధికారి ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.