calender_icon.png 31 January, 2026 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక రామప్ప

31-01-2026 12:41:16 AM

-రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ మాన్ సింగ్

వెంకటాపూర్, జనవరి30,(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటపూర్ మండ లంలోని ప్రపంచ వారసత్వ హోదా పొంది న ప్రఖ్యాత రామప్ప (రామలింగేశ్వర స్వా మి) ఆలయాన్ని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ మాన్ సింగ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రామ లింగేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. డీజీ ఆలయ దర్శనానంతరం ఆల య అర్చకులు సంప్రదాయబద్ధంగా తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ గైడ్ వెంకటేష్ రామప్ప ఆలయ విశిష్టత, కాకతీయుల కాలానికి చెందిన అపూర్వ శిల్ప సంపద, ప్రత్యేక నిర్మాణ శైలిపై సవివరంగా వివరించారు. శతాబ్దాల కాలాన్ని అధిగమిస్తూ నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన కాకతీయుల నాటి అద్భుత శిల్పాలను చూసి డీజీ విక్రమ్ మాన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిల్పకళ, కట్టడాల రూపకల్పన అత్యంత విశిష్టంగా ఉందని కొనియాడారు. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి రామప్ప ఆలయం గొప్ప నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. రామప్ప ఆలయం దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షిస్తున్నదని, ఇలాంటి చారిత్రక కట్టడాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డీజీ పేర్కొన్నారు.