31-01-2026 12:41:50 AM
గాంధారి, జనవరి 30 (విజయ క్రాంతి ): రుణాలను రికవరీ చేయడంలో ఐకేపీ సిబ్బంది చొరవ చూపాలి అని ఐకెపి వివోఏ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పఠాన్ గౌస్ ఖాన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గాంధారి మండల కేంద్రంలో ఐకెపి వివోఏ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఐకెపి వివోఏ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పఠాన్ గౌస్ ఖాన్ మాట్లాడుతు గాంధారి మండలం లో సంఘాల సభ్యుల నుండి తీసుకున్న బ్యాంకు రుణాలు, శ్రీనిధి రుణాలు,మొండి బకాయిలు వసూలు చేయాలని సూచించారు.
100% రుణాలను రికవరీ చేసి మండలాన్ని కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉంచాలని ఐకేపీ సిబ్బంది ఏకగ్రీవంగా తీర్మానించుకున్నామని ఆయన అన్నారు.. పాత రుణాలను సకాలంలో చెల్లించి కొత్త రుణాలను పొందాలని మహిళా సంఘాల సభ్యులకు సిబ్బంది తెలియజేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగా విక్రం, మండల అధ్యక్షురాలు ప్రభావతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రావు, జిల్లా కార్యదర్శి లక్ష్మి ప్రియ, మయూరి భీమ్ రావు, భార్గవి, వనిత,స్వప్న, ప్రియాంక,పుష్పలత,సుజాత, కవిత,నిర్మల, శ్రావణి,వినోద్ పోశయ్య,భాస్కర్, పద్మ రోజా, లక్ష్మి,మహేశ్వరి, స్వప్న, విమల మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు.