31-01-2026 12:39:55 AM
మహబూబాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): రైతులు అధికంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను మో తాదుకు మించి వినియోగించడం వల్ల భూమి, నీరు గాలి కాలుష్యం పెరుగుతున్నదని, అంతే కాకుండా సాగు ఖర్చులు పెరిగి పోవడంతో ఆశించిన దిగుబడులు రాక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతు ల్లో రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫా ర్మింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జె.వి.ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, మల్యాల కేంద్రంగా ఐదు రోజుల పాటు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ శిక్షణకు 15 క్లస్టర్ల నుంచి ప్రతి క్లస్టర్కు ఇద్దరు చొప్పున మొత్తం 30 మంది కృషి సఖీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి అడ్లూరి ప్రశాంత్ కుమార్, శాస్త్రవేత్త హెడ్, జె.వి.ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, మల్యాల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, లాభాలు, పద్ధతులను వివరించి, రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకొని, స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన దిగుబడులు పొందవచ్చని తెలియజేశారు. శిక్షణ కార్యక్రమంలో నాల్గవ రోజు భాగంగా, తాడ్లపుస పల్లి గ్రామంలో ఉన్న బయో రిసోర్స్ సెం టర్ ను సందర్శించడం జరిగింది. ఈ బయో రిసోర్స్ సెంటర్ను నిర్వహిస్తున్న ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ ఎస్. జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భం గా రిసోర్స్ పర్సన్ వెంకట్రామిరెడ్డి ప్రకృతి వ్యవసాయంలో అనుసరించాల్సిన వివిధ పద్ధతులను కృషిసఖీలకు సవివరంగా వివరించారు. అలాగే, బీజామృతం, జీ వామృ తం, ఘన జీవామృతం, వేపకషాయం, దశపర్ణి కషాయం తదితర ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్ల తయారీ విధానాలను ప్రత్య క్షంగా చూపిస్తూ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అందించా రు. ఈ శిక్షణ ద్వారా కృషిసఖీలు ప్రకృతి వ్య వసాయ ఇన్పుట్ల తయారీపై ప్రాక్టికల్ అవగాహన పొందారు. అదేవిధంగా, ఉద్యాన క ళాశాల, మోజెర్ల విద్యార్థులు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రదర్శనలను ఏర్పాటు చేసి, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జె.వి.ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, మల్యాల సిబ్బంది పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.