26-01-2026 01:01:15 AM
పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు
కామారెడ్డి, జనవరి 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఘనంగా రథసప్తమి వేడుకలను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని రథంతో ఊరేగింపు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వేణుగోపాలస్వామి, పంచముఖ హనుమాన్ ఆలయంలోని వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు.
ఎల్లారెడ్డి ,బాన్సువాడ, బిచ్కుంద పట్టణాల్లో ఘనంగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు. బాన్స్వాడలో నియోజకవర్గంలోని తిమ్మాపూర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడుపు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
బాన్సువాడ నియోజకవర్గం బీర్కుర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులు పాల్గొన్నారు.
బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రథసప్తమి సందర్భంగా స్వామివారిని మాడవీదుల్లో సూర్యప్రభ వాహనంపై తిమ్మాపూర్ కోలాట బృందం ఆధ్వర్యంలో ఘనంగా ఊరేగించారు, తనే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఊరేగింపులో పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం బాన్సువాడ పట్టణంలో 6వ వార్డు, 7వ వార్డు, 13వ వార్డులో పర్యటించి వార్డు ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు , మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మీ మీ వార్డులనుండి సమర్థవంతమైన నాయకులను మీరే ఎన్నుకోవాలని వారికే మా పూర్తి మద్దతు ఉంటుందని, వారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలియచేశారు, అప్పుడు రానున్న రోజుల్లో మన వార్డులను, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీర్కూర్ మండల, బాన్సునాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, తిమ్మాపూర్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.