calender_icon.png 26 January, 2026 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ హితంగా సేవలు

26-01-2026 12:59:09 AM

  1. హైకోర్టు సీనియర్ న్యాయవాది సేవలు వెలకట్టలేనివి

రాష్ట్ర మాజీ జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి

నాగిరెడ్డిపేట్, జనవరి 25 (విజయ క్రాంతి): సమాజ హితం కోసం సేవలందిస్తున్న హైకోర్టు సీనియర్ న్యాయవాది సేవలు అమోఘమని మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఆదివారం ఆయన హైకోర్టు సీనియర్ న్యాయవాదిని సన్మానించి న అనంతరం ఆయనను ఉద్దేశించి మాట్లాడారు.కోర్టులో న్యాయ సమాజంలో కులమతాలకు అతీతంగా సీనియర్ హైకోర్టు న్యాయవాది సేవలు వెలకట్టలేనివని అన్నారు. 

కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన మొహ్మద్ మోయిన్ అహ్మద్ ఖాద్రి ముస్లిం సమాజంలో జన్మించి,కులమతాలకు అతీతంగా సమాజహితాన్ని లక్ష్యంగా చేసుకుని సేవలందిస్తున్నారని రాష్ట్ర మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.ప్రస్తుతం హైదరాబాద్ నారాయణగూడలో నివసిస్తూ సీనియర్ హైకోర్టు న్యాయవాదిగా వృత్తిని నిర్వర్తిస్తున్న మొహ్మద్ మోయిన్ అహ్మద్ ఖాద్రి,న్యాయస్థానాల్లో న్యాయసేవలతో పాటు సమాజ సేవలలోనూ ముందుండి నేటి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని తెలిపారు.

ఆదివారం నారాయణగూడలోని న్యాయవాది కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా న్యాయవాదిని కలిసి, మహమ్మద్ మోయిన్ హైమద్ ఖాద్రి చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...సదరు న్యాయవాది కోర్టుల్లో న్యాయవాద వృత్తిని అత్యంత నిబద్ధతతో నిర్వర్తిస్తూ,మరోవైపు కులమతాల మధ్య ఎలాంటి తారతమ్యం లేకుండా సామాజిక సేవలు అందించడం అభినందనీయమన్నారు.

ఆలయాల నిర్మాణం,గుడుల అభివృద్ధికి సహకారం అందించడంతో పాటు,పేదలు ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు అవసరమైన ఖర్చులకు ఆర్థిక చేయూత అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారని కొనియాడారు.న్యాయవాది చేస్తున్న సేవలు డబ్బుతో కొలవలేనివని,ఇలాంటి వ్యక్తులే సమాజంలో సామరస్యాన్ని,ఐక్యతను పెంపొందిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సామాజిక సేవలు చేపట్టాలని కోరుతూ,ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది సన్నిహితులు,ప్రముఖులు పాల్గొని హైకోర్టు సీనియర్ న్యాయవాది మహమ్మద్ మోయిన్ హైమద్ ఖాద్రి సేవలను అభినందించారు.