08-08-2025 12:06:19 AM
ఆదిలాబాద్, ఆగస్టు 7(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని రైతు వేదికలో గురువారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్(బీఆర్‌ఎస్), డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి (కాంగ్రెస్), కలెక్టర్ రాజర్షిషా ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఆత్మ కమిటీ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేస్తూనే.. గత బీఆర్‌ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని పార్టీ గొప్పలు చెప్పుకునేందుకు ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదంటూ బీఆర్‌ఎస్ ఆందోళనకు దిగారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు తోసుకున్నారు. ఎ మ్మెల్యే అనిల్‌జాదవ్, డీసీసీబీ చైర్మన్ భో జారెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొనడంతో ఉ ద్రిక్త వాతావరణం చో టుచేసుకుంది. కలెక్టర్ జోక్యంతో గొడవ సద్దుమణిగింది.