calender_icon.png 14 December, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీఎంలో రోగిని కరిచిన ఎలుకలు

14-12-2025 12:18:39 AM

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు    

మహబూబాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని మహాత్మా గాంధీ స్మారక వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కరిచాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ కు చెందిన అర్షం భరత్ కుమార్ కొద్ది రోజుల క్రితం కాలు సర్జరీ చేయించుకుని ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతని చేయి చూపుడు వేలును ఎలుకలు కొరకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే గమనించిన బంధువులు వైద్యులు, సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా వైద్యం చేశారు. ఇన్‌ఫెక్షన్ అయితే ప్రమాదమని భావించిన సిబ్బంది బాధితుడిని డిశ్చార్జి చేసే ప్రయత్నాలు చేశారని బంధువులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.  కాగా ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆస్పత్రిలో స్లాబు పెచ్చులు ఊడి కింద పడ్డాయి.

అలాగే ఒకే ఆక్సిజన్ సిలిండర్ ఇద్దరు రోగులకు అమర్చడం వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రిలో ఎలుకలు, చీడపీడల నివారణకు ఆస్పత్రి శాని టేషన్ కాంట్రాక్టర్ బెస్ట్ కంట్రోల్ మేనేజ్‌మె ంట్ సరిగా నిర్వహించకపోవడం వల్లే ఎలుకలు విపరీతంగా పెరిగి రోగులను కరుస్తున్నా యని వాపోతున్నారు.  ఆస్పత్రిలో ఎక్కడపడి తే అక్కడ చెత్తాచెదారం వేయడం వల్ల ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని చెబుతున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.