calender_icon.png 14 December, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో ప్రొఫెసర్ మృతి

14-12-2025 12:17:05 AM

  1. వెంకట సుబ్బారెడ్డి వరంగల్ నిట్‌లో విధుల నిర్వహణ

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో మృతదేహం

కాజీపేట, డిసెంబర్ 13 (విజయక్రాంతి): వరంగల్ ఎన్‌ఐటి (నిట్)లో కంప్యూటర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట సుబ్బారెడ్డి శుక్రవారం ధర్మసాగర్ రిజర్వాయర్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

కడప జిల్లా బద్వేలుకు చెందిన వెంకట సుబ్బారెడ్డి నిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ధర్మసాగర్ రిజర్వాయర్ లో మరణించిన ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య కు పాల్పడ్డాడా లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్నది తెలియాల్సి ఉంది.