calender_icon.png 17 August, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సవాళ్లకు అసలైన పరిష్కారాలు

02-01-2025 12:00:00 AM

ప్రపంచ వేదికపై అనేక విధాలుగా, దేశీయంగా 2024 భారతదేశానికి గణనీయమైన సంవత్సరంగానే చూడవలసి ఉంది. భారత్ ఇప్పుడు ఒక ప్రధాన ‘గ్లోబల్ ప్లేయర్’గా స్థిరపడాలని చూస్తున్న దేశం. ఇది 2024 చివరి స్ట్రెయిట్ టాక్‌గా వినిపిస్తున్నది. కాబట్టి, రీక్యాప్ (పునశ్చరణ) అవసరమని ఆర్థిక, మార్కెట్ రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గడచిన 12 నెలల్లో భారతదేశం చూసిన వాటిని ఉత్తమంగా వివరిం చడానికి అనేక అంశాలు ఉన్నాయి. 2025 ఏడాది దేశవ్యాప్తంగా ఘనమైన వేడుకలతో ప్రారంభమైన తరుణంలో ఈ దిశగా కేంద్ర ప్రభుత్వ పాలకుల కృషి మరింతగా ఇనుమడించాల్సి ఉంది.

భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికై వేగంగా దూసుకు పోతున్నట్టు సానుకూల భావజాలం గల ఆర్థిక నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ లక్ష్యసాధనలో 2025 నూత న సంవత్సరంలో ఏ రకమైన సవాళ్లు ఎదురు కానున్నాయి? వాటిని పాలక వ ర్గాలు, ఉన్నతశ్రేణి వాణిజ్య అధికారులు, మార్కెట్, కార్పొరేట్ రంగాలు, ఆర్థిక నిపుణులు ఏ మేరకు అధిగమించనున్నార న్నది కీలక ప్రశ్న. 

5వ స్థానంలోకి!

ఈ తరుణంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిబద్ధత, పట్టుదల, కృషి, క్రియాశీలతలు వంటి కార్యాచరణపైనే నిపుణులు గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2025 చి వరి నాటికి అంతర్జాతీయ స్థాయిలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మిగిలి పోకుండా, జపాన్‌ను అధిగమించడానికి కావలసిన అన్ని హంగులనూ సమకూర్చుకునే దిశగా కొత్త ఏడాది అడుగులు వేయవలసి ఉంది.

2024 నబంబర్ నాటి సమాచారం ప్రకా రం 29.17 ట్రిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో, 18.27 ట్రిలియన్ డా లర్లతో చైనా రెండవ స్థానంలో, 4.71 ట్రిలియన్ డాలర్లతో జర్మనీ మూడవ స్థానంలో, 4.07 ట్రిలియన్ డాలర్లతో జపాన్ నాలుగో స్థానంలో ఉండగా, భారతదేశం 3.89 ట్రిలియన్ డాలర్లతో అయి దో స్థానాన్ని చేరుకోవడం విశేషం. 3.59 ట్రిలియన్ డాలర్ల బ్రిటన్‌ను అధిగమించడం ద్వారా భారత్ ఈ ఆధిక్యతను సాధించడం విశేషం. 

ట్రంప్ విధానాలపై కొత్త ఆశలు

జనవరి నెలలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించను న్నారు. అప్పుడు భారతీయ వాణిజ్య రంగంలో ఏం జరుగనుందనేది ప్రస్తుతానికి సస్పెన్సే. అయినా, కొన్ని అంచనాలు లేకపోలేదు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాణిజ్యం అనిశ్చితికి ఆస్కారం ఉంటుందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని ప్రధాని మోదీ ఎలా చక్కదిద్దగలరన్నది ఆసక్తికరమైన విషయం.

అయితే, భారతదేశంలో గ్రామీణ డిమాం డ్ ఊపందుకునే అవకాశమూ ఉంది. సానుకూల కోణంలో, గ్రామీణ డిమాండ్ ఊపందుకుకోగలిగితే ఆశావహ ఫలితాలలో వేగం కనిపించవచ్చు. ఈ నేపథ్యం లో దేశంలో ద్రవ్యోల్బణం అంత తీవ్ర సమస్య కాకపోవచ్చునన్న అంచనాలు కూ డా వున్నాయి. ట్రంప్ భారతదేశాన్ని ‘టారిఫ్ కింగ్’గా అభివర్ణించిన విషయం గమ నార్హం. భారతదేశ ఎగుమతులపై పరస్పర సుంకాలను విధించే ఉద్దేశాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

మెక్సికో, కెనడా, చైనాలపై ట్రంప్ ప్రతిపాదించిన టారిఫ్‌ల కారణంగా కొన్ని వాణిజ్య ప్రవాహాలను భారతదేశానికి మళ్లించ వచ్చునన్న ఆలోచనలు కూడా విశ్లేషకులలో లేకపోలేదు. అయితే, దీనికోసం దేశంలో తయారీ రం గం తన సాంకేతిక సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవలసిన అవసరం ఉంటుంది. దేశీయ ఉత్పత్తుల ఎగుమతులలో వృద్ధి వేగం మరింతగా పుంజుకోవాలి.

అస్థిరతలోనూ ఆశావాదం

ఇదే సమయంలో గత కొన్ని రోజులు గా రూపాయి విలువ వేగంగా పతనం అవుతున్న సంగతిని మనం మర్చిపోకూడదు. భారతదేశం సహా అభివృద్ధి చెం దుతున్న మార్కెట్ కరెన్సీలు ఈ కొత్త ఏడాదిలో అస్థిరతను ఎదుర్కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న నిపుణుల అనుమానాల్లోనూ నిజం లేకపోలేదు. కరెన్సీ అ స్థిరతతోపాటు ఆర్థిక మార్కెట్లు కూడా డోలాయమాన స్థితిని ఎదుర్కొనవచ్చు.

ఐతే, 2025 సంవత్సరం ద్వితీయార్థంలో ట్రంప్ విధానాల చుట్టూ ఉన్న అనిశ్చిత స్థితి తగ్గుముఖం పట్టవచ్చన్న నమ్మకం కూడా మరోవైపు కనిపిస్తున్నది. గత మూ డేండ్లలో స్థూల స్థిర మూలధన నిర్మాణం ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగింది. ఈ వృద్ధి ప్రధానంగా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం నుండి వచ్చిం ది. ఆరోగ్యకరమైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ ఉన్నప్పటికీ, పెద్ద పరిశ్రమలకు క్రెడిట్ గత మూడు త్రైమాసికాల్లో సగటున 6 శా తం పెరిగింది.

వినియోగం పెరుగుదల చు ట్టూ ఉన్న అనిశ్చితి బహుశా తాజా సామ ర్థ్య జోడింపులను అడ్డుకుంటుంది. ప్రైవేట్ రంగ పెట్టుబడి దృక్పథం చైనా అధిక సామర్థ్యం నుండి మరింత ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని కూడా నిపుణులు భా విస్తున్నారు. బలహీన దేశీయ డిమాండ్, విస్తరిస్తున్న పారిశ్రామిక సామర్థ్యం చైనా నుంచి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఎగుమతుల విషయంలో పెరుగుదలకు దారితీసింది.

భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు చైనా ఎగుమతులను దారి మళ్లించే అవకాశం కూడా ఉంది. ఇది విస్తృతమైన వాణిజ్య లోటు, తక్కువ దేశీయ ఉత్పత్తి, సామర్థ్యం పట్ల పరిమిత ప్రోత్సాహకాల రూపంలో అనేక ప్రభావాలను కలిగి ఉంటుందని అంటున్నారు.

వ్యవసాయ ఆదాయం పెరగాలి

‘ప్రపంచ బ్యాంకు’ ప్రకారం 2025లో వస్తువుల ధరలు (ఇంధనం, వ్యవసాయం, లోహాలు, ఖనిజాలు) 5 శాతం తగ్గుతాయని అంచనా. కమోడిటీ ధరలలో అంచ నా తగ్గుదల 2025లో భారతదేశానికి ద్రవ్యోల్బణం ఒక సవాలుగా ఉండే అవకాశం తక్కువగా ఉందని సూచిస్తుంది. కరె న్సీ తరుగుదల, వాతావరణ సంబంధిత అంతరాయాలు ద్రవ్యోల్బణానికి తలకిందులయ్యే ప్రమాదాన్ని కలిగిస్తాయి. అభి వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో మందగమన వృద్ధి కారణంగా సరుకుల ఎగుమ తులు ప్రభావం చూపుతూనే ఉండవచ్చు. అయినా, బలమైన సేవల ఎగుమతులు, టెలికమ్యూనికేషన్, సమాచార సేవలు, ఇతర వ్యాపార సేవల ద్వారా ఆ లోటును భర్త చేయవచ్చని భావిస్తున్నారు. 

ఈ ఏడాది గ్రామీణ డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా. కరోనా మహమ్మారి తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వినియోగ డిమాండ్ అసమానంగా ఉంది. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పట్టణ డిమాండ్ కొంతవరకు పెరిగింది. అయితే, అధిక ఆహార ద్రవ్యోల్బణం, వ్యవసాయ ఉత్పత్తికి వాతావరణ సంబంధిత అంతరాయాల కారణంగా గ్రామీణ డిమాండ్ మాత్రం ఇంకా బలహీనంగానే ఉంది.

ప్రస్తుత ఏడాది కూడా డిమాండ్‌లో అసమానత కొనసాగగలదని అనుకుంటున్నారు. అయితే, ఈసారి రుతుపవనాలు మెరుగై వర్షాలు బాగా కురవడంతో గ్రామీణ డిమాండ్ పెరిగిందని చెప్పాలి. మెరుగైన వాతావరణ పరిస్థితులు, సాగు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున గ్రామీణ డిమాండ్‌లో ఎదుగుదల ఈ సంవత్సరంలో ఊపందుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు నమ్ముతున్నారు.

ఎరువులు వంటి వ్యవసాయ ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించడం వల్ల కూడా 2025లో ఆహార ద్రవ్యోల్బణం తగ్గి వ్యవసాయ ఆదాయానికి మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గమనించినప్పుడు పలు సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత్‌కు సానుకూలంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.