26-01-2026 12:00:00 AM
అశ్వాపురం, జనవరి 25 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బి.ఆర్.యస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం విస్తృత పర్యటన నిర్వహించారు. మొండికుంట గ్రామంలో ఇటీవల ఆపరేషన్లు చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పార్టీ సీనియర్ నాయకులు మిట్టకంటి వెంకట్ రెడ్డి, జాలే రామకృష్ణ రెడ్డి, గుండె ఆపరేషన్ అనంతరం విశ్రాంతిలో ఉన్న మండల శ్రీను, అనారోగ్యంతో బాధపడుతున్న మేడవరపు మంగపతిరావును ,రామచంద్రపురం గ్రామపంచాయతీలో ఇటీవల ప్రమాదానికి గురైన బొక్క సాంబశివారెడ్డి లను వారి స్వగృహాలకు వెళ్లి పరామర్శించారు.
అలాగే గొల్లగూడెం గ్రామపంచాయతీ సర్వేపాడు బంజర గ్రామంలో ఇటీవల దురదృష్టవశాత్తు మృతి చెందిన చిన్నారి కుంజా రమ్య చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి, రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం అశ్వాపురం మండలంలో జరుగుతున్న యన్టిఆర్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న మొండికుంట క్రీడాకారులకు సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి అందజేసి అభినందనలు తెలిపారు.
క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని క్రీడాకారులను ప్రోత్సహించారు. తదుపరి జగ్గారం గ్రామంలో కల్యాణపురం ఉప సర్పంచ్ చల్లా రాజేష్ నివాసంలో ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొని పార్టీ నాయకులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమం లో మండల అద్యక్షుడు కోడి అమరెంధర్, మాజీ యం.పి.పి కొల్లు మల్లారెడ్డి ,మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ,కాసరబాద శ్రీను ,రామగిరి భాస్కర్ మరియు పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.